బ్యాగులు ఆవిష్కరిస్తున్న మంత్రి
ప్రజాశక్తి, కదిరి టౌన్ : జగన్మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలను చైతన్య పరిచేవిధంగా వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తల హరిప్రసాద్ తయారు చేయించిన జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలతో కూడిన బ్యాగులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. బుధవారం తిరుపతిలో మంత్రి స్వగహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తలహరిప్రసాద్, బత్తల యువసేన నాయకులు ముబారక్, పవన్, జోక్షన్, ప్రతాప్, యశ్వంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.










