Nov 13,2023 21:31

మాట్లాడుతున్న శంకరరావు, రామ్మూర్తినాయుడు తదితరులు

ప్రజాశక్తి - వంగర : ఈ నెల 25న మండల కేంద్రంలో జరగనున్న మండల భవన నిర్మాణ కార్మికుల 2వ మహాసభలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకరరావు, కార్యదర్శి సిహెచ్‌ రామ్మూర్తినాయుడు, మండల అధ్యక్ష కార్యదర్శులు డి.అప్పలనాయుడు, ఎ.ఆదినారాయణ కోరారు. సోమవారం వంగరలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు రాష్ట్ర, మండల స్థాయిలో నిర్వహించామని, స్థానికంగా యజమానులకు కార్మికులకు మధ్య వచ్చిన సమస్యలను యూనియన్‌ అనేక దపాల పరిష్కారాలు చేసిందని, గత మూడేళ్ల కాలంలో సంఘం చేసిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకోవడానికి ఈ మహాసభను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు పి. విశ్వనాథం, ఎం. త్రినాధ రావు. మండల నాయకులు రామారావు, శ్రీనివాసరావు, గౌరి నాయుడు, ఆదినారాయణ, శ్రీను, సూరిబాబు, కళ్యాణ్‌, సత్యం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.