లక్నో : టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. రెండు టీమ్‌లు 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినా.. పరుగులు 200 దాటలేదు. దీంతో పిచ్ సిద్ధం చేసిన లక్నో క్రికెట్ స్టేడియం క్యురేటర్‌పై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) వేటు వేసింది. క్యురేటర్ పదవి నుంచి ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో సంజీవ్ కుమార్ అగర్వాల్‌ను నియమించింది.
కాగా ఐపీఎల్ టీం లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది హౌం గ్రౌండ్. ఈ ఏడాది ఐపీఎల్లో కనీసం 7 మ్యాచ్‌లు ఈ మైదానంలో జరుగుతాయి. అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో జట్టుకు కూడా ఇదే హౌం గ్రౌండ్. దీంతో ఐపీఎల్ కోసం కొత్త పిచ్‌ను తయారు చేసే బాధ్యతను సంజీవ్ కుమార్‌కు అప్పగించారు. బీసీసీఐ క్యురేటర్ తపోష్ ఛటర్జీతో కలిసి ఆయన పని చేయనున్నారు. సంజీవ్ కు గతంలో బంగ్లాదేశ్‌లో పిచ్‌లను తయారు చేసిన అనుభవం ఉంది.










