ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :జిల్లాలో గౌడ్ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దష్టి సారిస్తానని జై గౌడ్ జిల్లా ఉద్యమం అధ్యక్షులు మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్ పేర్కొన్నారు. మండలంలోని వరిగొండ గ్రామంలో ఆదివారం 2023 జై గౌడ్ క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. స్థానిక జై గౌడ్ నాయకులు ఉప్పల కిషోర్ గౌడ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి సుబ్రహ్మణ్యం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో గౌడ్ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కషి చేస్తానని సుబ్రహ్మణ్యం గౌడ్ తెలిపారు. అనంతరం గ్రామంలోని పసిడి పుట్టాలమ్మ అమ్మవారి గుడిలో సుబ్రహ్మణ్యం గౌడ్ జై గౌడ్ క్యాలండర్ ను ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షులు మన్నెం పుట్టయ్య గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి అన్నభత్తిన కష్ణ గౌడ్, సర్వేపల్లి అధ్యక్షులు ఉప్పల పరమేశ్వర్ గౌడ్, సర్వేపల్లి యువత అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్, చల్ల రమేష్ గౌడ్, నిమ్మల రమేష్ గౌడ్, కోమరి కిషోర్ గౌడ్, వంశీ గౌడ్, నడవల అశోక్ గౌడ్, శివ గౌడ్, అశోక్ గౌడ్, ముని గౌడ్, సురేష్ గౌడ్,వెంకటేశ్వర్లు గౌడ్, నవీన్ గౌడ్ ఉన్నారు.










