May 05,2023 16:43

ప్రజాశక్తి-మంగళగిరి : మార్క్సిజం అజేయమని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చేంగయ్యా అన్నారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరి సిపిఎం కార్యాలయంలో కార్ల మార్క్స్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెంగయ్య మాట్లాడుతూ మార్క్స్ ప్రపంచంలో ఉన్న అన్ని పరిస్థితులను అధ్యయనం చేసి కమ్యూనిస్టు ప్రణాళిక సిద్ధాంతాన్ని రాశారని అన్నారు. కార్మిక వర్గం రాజ్యం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విప్లవాలు జరిగాయని కమ్యూనిస్టు ప్రభుత్వ ఏర్పడ్డాయని అన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ మానవుడు సుఖంగా ఉండాలంటే మాక్సిజమే అని అన్నారు. మానవులంతా సమానంగా జీవించాలని మార్క్సిజమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వివి జవహర్లాల్, ఎం బాలాజీ, పట్టణ నాయకులు ఎస్ గణేష్, టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.