ప్రజాశక్తి-దర్శి: విద్యార్థులకు క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక ఆరోగ్యం కలుగుతుందని శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఆవుల వెంకట రమణారెడ్డి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా వారోత్సవాల కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తాళ్లూరు సరస్వతి కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి విద్యార్థులతో ప్రసంగించారు. మానసిక ఒత్తిడికి తట్టుకుని గెలుపు ఓటములను సమానంగా చూడాలని విద్యార్థులను కోరారు. క్రీడలు ఆడేవారు క్రమశిక్షణతో ఆడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. విద్యార్థి దశలోనే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమణారెడ్డి సతీమణి పద్మ, హెచ్‌ఎం శ్రీరామమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.