అమరావతి : కోనసీమ ప్రాంతంలో రైతులు క్రాప్‌హాలీడే ప్రకటనలు వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ నారా లోకేష్ డిమాండ్ చేశారు. పూడుకుపోయిన డ్రైయిను, వరుస విపత్తులు, ముంపు బెడదతో పంట విరామానికి కోనసీమ రైతులు నిర్ణయం తీసుకున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. సర్కారు నుంచి ఎటువంటి సాయం అందక విరక్తితో పంటల విరామనాకి తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టకరమని తెలిపారు.










