జీవిత బీమాపై అవగాహన ర్యాలీ
ప్రజాశక్తి-ఉదయగిరి : గ్రామీణ తపాలా జీవిత బీమా అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్న పోస్టల్ శాఖ సేవలను అందరూ వినియోగించుకోవాలని సిబ్బంది అవగాహన ర్యాలీని నిర్వహించారు. బుధవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో పోస్టర్ శాఖ ర్యాలీ నిర్వహిస్తూ వారు మాట్లాడుతూ పోస్టల్ శాఖ అందించే సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలన్నారు. నెల్లూరు పోస్టల్ శాఖ సూపర్డెంట్ ఆదేశాల మేరకు ఈ జీవిత బీమాపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పాలసీ వల్ల ఆదాయ పన్ను, రాయితీ నామినేషన్ సౌకర్యం, రుణ సౌకర్యం సదుపాయం కలదన్నారు. జనంలోకి మనం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పోస్టల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.










