Mar 14,2022 06:56

అంతరిక్షంలో ఏ మూలనో
ఒంటరి నక్షత్రమేదో శిధిలమైనట్టుంది
నా అంతరంగంలో ఈవేళలో
ఉల్కాపాతమై పలకరించింది
ఎరుక తెలియని గోళమైనా
లక్షల యోజనాల దూరమైనా
గుండె లయతో సంధానమైంది
భావోద్వేగ బంధమైంది!

విశ్వ దేహంలో ఒంటరి దీవులే లేవు
ఒకటిగా పారే ఆత్మ ప్రవాహం తప్ప ..
- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ
94408 36931