హాయిగొలిపే నవ్వులా
పరిమళించే పువ్వులా
అనంత రసధునిలా
అమృతమయ చెలిమిలా
ఉప్పొంగే సంద్రంలా
ఉరికే జలపాతంలా
పున్నమి జాబిలిలా
వేకువ వేళ వెన్నెలలా
ఓ ముత్యపు చినుకులా
ఓ తీయని గెలుపులా
ప్రేమామృత ధారలా
పోరులో అధినేత్రిలా
బూజు భావాలపై
భగభగమనే నిప్పు కణికలా
తిరోగమన సిద్ధాంతాలపై
తిరగబడే తెగువలా
దుర్మార్గుల దాష్టీకాలపై
ధ్వజమెత్తే ధీరలా
ఓ మగువా, సాగిపో నువ్వలా
ఆకాశమే హద్దుగా..
సగం కన్న మిన్నగా ..!
- టీనా










