ప్రకృతి మనకి ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది
పాఠంగా నేర్చుకుంటే బతుకు బాగు పడుతుంది
కొమ్మ నుంచి విడివడ్డ ఆకు గాలికి ఎటో ఎగురుతుంది
అంటే ..
చెడిపోయిన ప్రతి ఒక్కరూ నేలకు జారక తప్పదు
వర్షం శృతిమించి కురిస్తే వరదై పోటెత్తుతుంది
అంటే...
తప్పు దారిలో వెళ్లే ప్రతి ఒక్కరూ ఏడవక తప్పదు
వర్షం పడిన తర్వాత మట్టి పరిమళం విరజిల్లుతోంది
అంటే ...
ఏడ్చి కష్టాన్ని ఎదిరించిన తర్వాతే గెలుపు రుచి తెలుస్తుంది
ఎన్నో ఉలిదెబ్బలు తట్టుకుంటేనే రాయి శిల్పం కాగలదు
అలాగే...
ఎన్నో కష్టాలు భరిస్తే కాని మనం మనుషులు కాలేము
ఈ పాఠాలన్ని ప్రకృతిలోనే కనిపిస్తాయి...
కానీ వాటి జవాబులు కోసం ఎక్కడో వెతుకుతాము
అందుకే ప్రకృతిని అన్వేషిద్దాం
ప్రకృతిని అనుసరిద్దాం .. ప్రకృతిని ఆస్వాదిద్దాం!
- స్ఫూర్తి అండ్ర










