కళ్ళుండీ గంతలు కట్టుకున్న
గాంధారి అవతారులకు
అమరావతి రూపానికి
కన్న తల్లెవరో కళ్ళకు కట్టినా
న్యాయ పీఠం చెప్పే పాఠం
ఎన్నాళ్ళకు ఎక్కుతుంది?
గాల్లో తేలుతూ ఊగే వాళ్లకు
నేల చూడటం కష్టమే మరి
కన్నీళ్ళూ చెమట ధారలూ
ఆకాశానికి అతుక్కోవుగా
అవి నేలపైనే రాలతాయి
రాజ్యం ... రాజధానుల్లో
హక్కెవరిదో భుక్తలెవరో
రాజ్యాంగం రాసి పెట్టినా
గోడమీదెక్కిన ఢిల్లీ పిల్లి
సరైన దారికి దూకుతుందా?
- ఉన్నం వెంకటేశ్వర్లు










