Aug 25,2022 14:46

ప్రజాశక్తి - మైలవరం : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారానే పెండింగ్లో ఉన్న క్లైములు చెల్లించాలని, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చండ్రగూడెం, పుల్లూరులో బిల్డింగ్‌ రంగా కార్మికుల సమావేశం చండ్రగూడెం శివాలయంలో జరిగింది. నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తూ మెమో నెంబర్‌ 1214 తీసుకువచ్చిందన్నారు. ఈ మెమో వల్ల రాష్ట్రంలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులకు రావలసిన, సంక్షేమ నిధులు ఆగిపోయాయన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తి సహాయం 3277 మంది, సహజ మరణం 425, అంత్యక్రియలు 530 ,పెళ్లి కానుక 112 ,ప్రమాద మరణం 9 ,హాస్పటల్‌ ఖర్చులు 259, స్కాలర్షిప్స్‌ 111,అంగవైకల్యం3., మొత్తం 46 96 మంది సంక్షేమ బోర్డుకి అప్లై చేసుకుని ఉన్నారని వీరికి 11,21,93400 రాష్ట్ర ప్రభుత్వం చెల్లెలించాల్సిన అవసరం ఉందని అన్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్న క్లైమ్‌ లన్ని చెల్లించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాపిత ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్‌ సుధాకర్‌, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షులు ఎన్‌ దుర్గారావు, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, వేముల శ్రీనివాసరావు, బ్రద్వి నివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
కమిటీ : అధ్యక్షులుగా మర్రి వాసు, ఉపాధ్యక్షులు పంబి గోపయ్య, ప్రత్తిపాటి బాలస్వామి, ప్రధాన కార్యదర్శి సంగు జమలయ్య, సహాయ కార్యదర్శి వేముల నరసింహారావు, కోశాధికారి శీలం తిరుపతిరావు, 18 మందితో కూడిన కమిటీని ఎన్నుకోవడం జరిగింది
 

bulding workers