ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐడెంటి కార్డులు పంపిణీ
ప్రజాశక్తి-డోన్
ఇన్నర్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపయోగపడే ఐడెంటి కార్డులను పంపిణీ చేసినట్లు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు కె.శాలినిప్రకాష్ తెలిపారు.సోమవారం డోన్ మండల పరిధిలోని యు.కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 325 మంది విద్యార్థులకు డోన్ పట్టణానికి చెందిన విజయశ్రీ జువెలర్స్ యజమాని రామాంజనేయులు ఆచారి ఆర్థిక సౌజన్యంతో రూ. 20000 విలువ చేసే ఐడెంటి కార్డులను పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు కె.షాలినిప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిం చారు. విద్యార్థులకు ఇచ్చిన ఐడెంటి కార్డులు పదవ తరగతి చదివేంతవరకు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడే ఐడెంటి కార్డులు ఇచ్చేందుకు ఆర్థిక సహకారం అందించిన విజయశ్రీ జువెలర్స్ యజమాని రామాంజనేయులు ఆచారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమ ంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఫౌండర్ రాజా సుజాత,సభ్యులు విజయమ్మ, శకుంతల, రాజకుమారి,వైష్ణవి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.