Dec 25,2022 21:11

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్న టిడిపి మహిళా నేతలు

ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాలతో కందుకూరు పట్టణ మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని 14, 26వ వార్డుల్లో మహిళా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈనెల 28వ తేదీన కందుకూరులో జరిగే టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్‌ షోకు అందరూ తరలిరావాలని కోరారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, నెల్లూరు పార్లమెంట్‌ మహిళా కార్యదర్శి బత్తిన ఆదెమ్మ, రావి సరిత, మల్లవరపు సీత, బి.దాక్షాయిని, చలంచర్ల పద్మ, పిడికిటి లక్ష్మి, పొడపాటి రాధ, అమ్మనుబోయిన వెంకటరత్నం, బక్కముంతల మమత, ఎస్తేరమ్మ, కామినేని అశ్విని, శ్రీదేవి, కాకుమాని విజయలక్ష్మి, కాకుమాని విజయ, కాకుమాని రాజ్యలక్ష్మి, 26వ వార్డు అధ్యక్షులు రత్తయ్య, కాకుమాని మాల్యాద్రి, కాకుమాని శ్రీనివాసులు, కాకుమాని విజయ, కాకుమాని రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.