- ఆటోమెటిక్‌గా 'అదనపు' బాదుడు
- 'పీక్ డిమాండ్' పేరిట జనానికి షాక్
- కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అదనపు లోడు, పీక్ డిమాండ్ పేరిట ప్రజలపై విద్యుత్ భారం మోపాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ ప్రిపెయిడ్ మీటర్ల ద్వారా వినియోగదారులకు తెలియకుండా ఈ భారాలు మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. డిమాండ్ అధికంగా ఉను సమయంలో విద్యుత్ వినియోగిస్తే 20శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేయాలని తెలిపింది. అందుకోసం 2025 ఏప్రిల్ 1 నాటికి వ్యవసాయ వినియోగదారులు మినహా అన్ని రకాల కనెక్షన్లకుస్మార్ట్ ప్రిపెయిడ్ మీటర్లు బిగించాలనికేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎలక్ట్రసిటీ (రైట్ ఆఫ్ కన్య్సూమర్) సవరణ రూల్స్-2023 ముసాయిదాను కేంద్రం తీసుకొచ్చింది. ఈ ముసాయిదాపై ఏప్రిల్ 14 లోపు అభిప్రాయాలు చెప్పాలనిరాష్ట్రాలను కోరింది. రాష్ట్రాల అభిప్రాయాల అనంతరం ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకునే సమయంలో మనం వాడుకునే విద్యుత్ ఉపకరణాలను బట్టి కిలో వాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ లోడ్ చొప్పున డిస్కంలు వినియోగదారులకు కనెక్షన్లు ఇస్తాయి. ప్రస్తుతం గృహ వినియోగదారుల నుంచి డిస్కంలు కిలోవాట్ లోడ్‌కు కన్సంషన్ డిపాజిట్ రూ.1750, రెండు కిలోవాట్స్‌కురూ.3,750 వసూలు చేస్తున్నాయి. వినియోగదారుడు తీసుకున్న లోడ్‌కంటే అదనంగా ఏడాదిలో మూడు నెలలు వాడకం పెరిగితే పెరిగిన కేటగిరీకి మార్చాలని తెలిపింది. గరిష్ట రికార్డు డిమాండ్ (ఎంఆర్‌డి) పేరుతో అదనపు లోడ్‌ను తరువాత ఏడాదిలో పెరిగిన కేటగిరీకి మార్చాలని పేర్కొంది. స్మార్ట్ మీటర్ల ద్వారా దీనిని లెక్కించాలని తెలిపింది. లోడ్ పెరిగితే కేటగిరీ మార్చాలను కేంద్రం తీసుకును లోడ్ కంటే తగ్గితే ఇవ్వాల్సిన మినహాయింపునకు వెసులుబాటు కల్పించలేదు. ఇది మాత్రం విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం ప్రకారం ఉంటుందని పేర్కొంది. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉను సమయంలో వినియోగదారుల నుంచి 20శాతం అధికంగా చార్జీలు వసూలు చేయాలని కేంద్రం వెల్లడించింది. దీనికోసం టైం ఆఫ్ డే (టిఓడి) విధానానిు తీసుకొచ్చింది. 2024 ఏప్రిల్ 1లోపు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు, ఇతర వినియోగదారులకు 2025 ఏప్రిల్ 1లోపు ఈ విధానానిు అమలు చేయాలని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 నుంచి 12 వరకు, సాయంత్రం 6 నుంచి 9 వరకు గరిష్ట డిమాండ్ ఉంటోంది.
- తనిఖీలు లేకుండానే జేబులకు చిల్లులు!
కేంద్రం తీసుకొస్తును ఈ విధానం వల్ల వినియోగదారుల జేబుకు భారీగా చిల్లుపడుతుంది. వినియోగదారుల వాడకం లోడ్ పెరిగిందనే కారణంతో విద్యుత్ శాఖ అధికారులు గతంలో ఇళ్లల్లోకి చొరబడి అక్రమంగా ఫైన్లు వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పట్టణాల్లో విద్యుత్ శాఖ వినియోగదారులను వేధింపులకు గురిచేశారు. దీనిపై ప్రజలు, వామపక్షాలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించడంతో వెనక్కు తగ్గి మళ్లీ ఇప్పుడు మొదలు పెట్టింది. ఇక నుంచి అధికారులు తనిఖీ చేయాల్సిన, బిల్లు చెల్లించాలని వినియోగదారులపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉండదు. అంతా ప్రిపెయిడ్ మీటర్‌తో స్మార్ట్‌గా వినియోగదారుల జేబులకు డిస్కంలు చిల్లులు పెడుతూ ఉంటాయి. ప్రిపెయిడ్ మీటర్లు బిగిస్తే ప్రస్తుతం వినియోగిస్తును సెల్‌కు రీఛార్జ్ చేసుకునుట్లు కరెంట్‌కు కూడా రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ప్రిపెయిడ్ మీటర్లు తీసుకురావడం వల్ల కూడా అదనపు లోడ్, ఇతర పేర్లతో వినియోగదారుల నుంచి భారీ స్థాయిలో వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇక విద్యుత్ మీటర్లకు చేయించుకున్న రీచార్జ్ ఎప్పుడు అయిపోతుందో తెలియక ప్రజలు గందరగోళంలో పడే ప్రమాదం ఉంది.










