ప్రజాశక్తి-మార్కాపురం : వైసిపి ప్రభుత్వ పాలనలో రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైనట్లు టిడిపి, నాయకులు తెలిపారు. రైల్వే స్టేషన్ రోడ్డులో కార్ స్టాండ్ వద్ద రహదారిపై ఏర్పడిన గుంతల వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఏర్పడిన గుంతలను ఏళ్ల తరబడి పట్టించుకోలేదన్నారు. కనీసం మరమ్మతులు కూడా చేపట్టక పోవడంతో ప్రయాణికులు, వాహన చోదకులకు అవస్థలకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి, ఇక్కడి పాలకులకు ఈ గుంతలు కనిపించడం లేదా అని నేతలు ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు, టిడిపి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి తాళ్లపల్లి వెంకటసత్యనారాయణ, టిడిపి పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, ఎఎంసి మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, టిడిపి బిసిసెల్ పట్టణ ఉపాధ్యక్షుడు డి.నాసరయ్య, తర్లుపాడు మండల టిడిపి అధ్యక్షుడు ఉడుముల చిన్నపరెడ్డి, నాయకులు ఇబ్రహీంఖాన్, సయ్యద్ గఫార్, గులాబ్‌ఖాన్ పాల్గొన్నారు.