తనిఖీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-గుడ్లూరు : గుడ్లూరు మండలంలో గ్రామపంచాయతీ దగ్గర నుంచి లైబ్రరీ సెస్సు వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉండరాదని గ్రంథ పాలకుడిని జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ కె ఆదిలక్ష్మి తెలిపారు. గుడ్లూరు మెయిన్ బజార్‌లో ఉన్న గ్రంథాల్య భవనాన్ని ఆమె మంగళవారం సందర్శించి తనిఖీలు నిర్వహించారు. వార్షిక తనిఖీలో భాగంగా రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుడ్లూరు మండలంలో 10 లక్షల రూపాయలకు పైగా చెస్ వసూలు కావలసి ఉండగా ఒక పైసా కూడా వసూలు చేయకపోవడం గ్రంథపాలకుడు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆమె తెలిపారు. గ్రంథపాలకుడు ప్రభాకర్ రెడ్డి పాఠకులు పాల్గొన్నారు.










