ప్రజాశక్తి - గుర్ల : మండలంలోని తెట్టంగిలో సోమవారం రాష్ట్ర బిసి సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెన్నె సన్యాసినాయుడు ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి టిడిపి మినీ మెనీఫెస్టోను ప్రజలకు వివరించారు. నియోజకవర్గ ఐటిడిపి అధ్యక్షులు నాగులపల్లి నారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సన్యాసినాయుడు మాట్లాడుతూ టిడిపి అధికారం లోకి వచ్చిన వెంటనే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన అంశాలన్నీ అమలు చేయడం జరుగుతుందన్నారు. దానికి గాను ప్రతి కుటుంబానికి ఒక బాండ్ కూడా ఇస్తున్నామన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జ్ గేదెల లక్ష్ము నాయుడు, గండ్రేటి సింహాచలం, పాండ్రంకి శ్రీను పాల్గొన్నారు.
శృంగవరపుకోట: టిడిపి నియోజకవర్గ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర ఐటిడిపి కార్యదర్శి చక్కా కిరణ్కుమార్, టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి రోహిణికుమార్ పలువురు టిడిపి నాయకులతో మండలంలోని తిమిడి గ్రామంలో గంగిరెడ్లకల్లాలు, పలు ప్రాంతాల్లో సోమవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యాంరెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి కరపత్రాలను పంపణీ చేశారు. అనంతరం ప్రజావేదిక ద్వారా గ్రామ ప్రజలకు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేయబోయే మేనిఫెస్టోలోని అంశాశాలను వివరించారు. ప్రభుత్వానికీ, ముఖ్యమంత్రికీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతీ క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్ల పరిధిలో ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి దొంగ ఓట్లను గుర్తించాలని, టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తే, వాటిని మరల చేర్పించాలని సూచించారు. కొత్త ఓట్లపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
పూసపాటిరేగ: మండలంలోని గోవిందపురంలో సోమవారం రాత్రి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టిడిపి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు ఇంటి ఇంటికి తిరిగి భవిష్యత్ గ్యారెంటీ బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, టిడిపి మండల అధ్యక్షులు మహంతి శంకర్రావు, టిడిపి పార్లమెంట్ టిఎన్టియుసి అధ్యక్షులు విక్రమ్ జగన్నాధం, మండల కోశాధికారి ఇనపకుర్తి శ్రీను, బూత్ ఇంఛార్జిలు తదితరులు పాల్గొన్నారు.