Jun 22,2023 17:11

న్యూఢిల్లీ :   2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ ఆర్థిక వృద్ధి రేటును (జిడిపి) ని గురువారం 6.3 శాతానికి పెంచింది. గతంలో 6శాతంగా అంచనా వేసినట్లు   ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. మొదటి త్రైమాసికంలో ఉత్పాదకత పెరగడం, స్వల్పకాలంలో మెరుగైన వృద్ధికి అవకాశం  ఉండటంతో అంచనాను పెంచినట్లు  పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2023లో వృద్ధి రేటు 7.2గా అంచనా వేయగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 22)లో 9.1 శాతంగా ఉంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో జిడిపి ఏడాదికి 6.1 శాతం పెరిగింది. ఆటో సేల్స్‌, పిఎంఐ సర్వేలు, రుణాల్లో మెరుగైన వృద్ధి  పెరగడంతో.. అంచనాను మార్చి 2024 నాటితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి 0.3 శాతాన్ని కలిపి 6.3గా అంచనా వేసినట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గడంతో  దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని వివరించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరాలు వరుసగా (ఎఫ్‌వై 2024-25), (ఎఫ్‌వై 2025-26)ల్లో జిడిపిని 6.5గా అంచనా వేసింది.