ప్రజాశక్తి-కలకడ: మండల కేంద్రమైన కలకడలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం రాత్రి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎంఈఓవై ఆదినారాయణ రెడ్డి, ఎస్సై తిప్పే స్వామి లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ,ఉత్తమ గుణాలు కలిగి ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్లాలని సూచించారు .ఉపాధ్యాయులు, పెద్దలు, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని చూపించి విద్యను నేర్చుకోవాలని అప్పుడే పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గౌరవ మర్యాదలు పెంపొందించబడతాయని సూచించారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్సై తిప్పేస్వామి, విశ్రాంతి ఎంఈఓ వై ఆదినారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించినట్లు ప్రిన్సిపాల్ నాగరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.










