Feb 01,2022 18:10

న్యూఢిల్లీ : టాటా సన్స్‌కు ఇటీవల అప్పగించిన ఎయిరిండియా రుణ బకాయిలు తీర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా బడ్జెట్‌లో రూ. 51,971 కోట్ల మేరకు కేటాయించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పివి) కింద ఈ రుణాలను బదిలీ చేస్తుంది. 2021-22లో మొత్తం ఖర్చులపై సవరించిన అంచనాల ప్రకారం కేటాయించింది. నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను టాటాసన్స్‌కు కేంద్రం రూ. 18 వేలకు కోట్లకు అప్పగించిన సంగతి విదితమే. ఇందులో రూ.2,700 కోట్లు నేరుగా ప్రభుత్వ ఖజానాకు టాటా సన్స్‌ చెల్లించింది. మిగతా రూ.15,300 కోట్ల రుణాలను సంబంధిత బ్యాంకులకు చెల్లిస్తుంది.