May 18,2023 22:39

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: డాక్టర్‌ నార్ల తాతారావు తాప విద్యుత్‌ కేంద్రం చీఫ్‌ ఇంజనీర్‌గా పి నవీన్‌ గౌతమ్‌ గురువారం ఉద్యోగ భాద్యతలు చేపట్టారు. ఎపి జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెవి ఎన్‌ చక్రధర్‌ బాబు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ సిఈగా పనిచేస్తున్న పి అశోక్‌కుమార్‌ రెడ్డి విద్యుత్‌ సౌధాలో జనరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా బదిలీ అయ్యారు. విద్యుత్‌ సౌధాలో కమర్షియల్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నవీన్‌గౌతమ్‌ ఎన్‌టిటిపియస్‌ సిఈగా బదిలీపై వచ్చారు. గతంలో ఈయన ఎన్‌టిటిపియస్‌ ఏఈ ఏడీఈ స్టేజీ 1 ఈఈ ఎస్‌ఈ 1 శిక్షణ కేంద్రం చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. గురువారం పి అశోక్‌కుమార్‌రెడ్డి భాద్యతలను కొత్త సిఈ పి నవీన్‌గౌతమ్‌కు అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న నూతన సిఈకి ఇంజనీర్లు ఉద్యోగులు కార్మికులు అభినందనలు తెలిపారు.