ఎడ్ల బండ లాగుడు పోటీలు
ప్రజాశక్తి-మర్రిపాడు : వినాయక చవితి సందర్భంగా ప్రతేడాది రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కొప్పోలు వెంకటేశ్వర్లు తెలియజేశారు. మండలం రామానాయుడు పల్లిలో మంగళవారం 1220 కేజీల బరువు గల బండ లాగుడు పోటీలు ప్రారంభం కాగా ఈ పోటీలలో పలు గ్రామాల నుండి 9జతలు ఎడ్లు పాల్గొన్నాయి. వింజమూరు మండలం బిసి కాలనీకి చెందిన బాలాజీ ఎడ్లకు ప్రధమ బహుమతి రూ.15వేలు, కొడవలూరు మండలం రామన్నపాలెంకు చెందిన హేమంత్ రెడ్డి ఎడ్లు ద్వితీయ బహుమతి రూ.12వేలు, బుచ్చి మండలం దామరమడుగుకు చెందిన దువ్వూరు శైలజా రెడ్డి ఎడ్లు తృతీయ బహుమతి రూ9వేలు గెలుపొందారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పంగులూరు వెంకటేశ్వర్లు నాయుడు, గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










