Sep 23,2022 15:43

ప్రజాశక్తి-వత్సవాయి : ప్రత్యేక హోదా విభజన హామీల అమల్లో రాష్ట్రాన్ని దగా చేసిన మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని మండల కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు రాయల సుదర్శనం పిలుపునిచ్చారు. వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామంలో సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో దేశ రక్షణ బేరి యాత్ర బహిరంగ సభ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న విజయవాడలో జరగనున్న దేశ రక్షణ బేరి మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి మోడీ పాలనలో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటూ తున్నాయని, జీఎస్టీ పేరుతో ప్రజలపై అనేక విధాలు అయిన భారాలు కేంద్ర ప్రభుత్వం వేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్, బ్యాంకులు సహా అన్నిటిని,ప్రైవేటు గురించి కార్పొరేట్లుకు కట్టబెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలందరూ ఐక్యంగా తిప్పి కొట్టాలని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ దేశ రక్షణ బేరి యాత్ర  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తారాజ్యంగా డీజిల్ ,పెట్రోల్ రేట్లు పెంచి 27 లక్షల కోట్ల రూపాయల  ప్రజలపై భారం వేసిందని అన్నారు. అదేవిధంగా అంబానీ అదానిలకు  విమానాశ్రయాలు,  టెలికాం, విద్యుత్తుల, ప్రభుత్వసంస్థలను ప్రైవేటీకరించివీరికి, కట్టబెడుతున్నారని, బడా కార్పొరేట్లకు 10 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని అన్నారు. 2014లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, విదేశాల్లో ఉన్న నల్ల డబ్బులు వెలుగు తీసి ప్రతి వ్యక్తికి 15 లక్ష రూపాయలు అకౌంట్ లో వేస్తామని  హామీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలైనా