డిజిటల్ కరెన్సీని తర్వలో అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2022-23 నుంచి ఆర్బిఐ ద్వారా డిజిటల్ కరెన్సీ ప్రవేశపెడతామన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుందని నిర్మల తన ప్రసంగంలో చెప్పుకున్నారు. డిజిటల్ రూపీ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆమె తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీల సాయంతో దీన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.










