Mar 14,2023 17:41

అహ్మదాబాద్‌ : జట్టు కోసం మంచి ప్రదర్శన చేసినపప్పుడల్లా గర్వపడతాననిటీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారీ శతకం (186) బాదాడు. ఈ టెస్టు డ్రాగా ముగియడంతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం విరాట్‌ కోహ్లీతో భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చిట్‌ చాట్‌ చేశాడు. కోహ్లీ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ తో మాట్లాడుతూకోహ్లీ మాట్లాడుతూ.. 'అంచనాల బరువును మోయడం నిజంగా కఠినంగా అనిపించింది. వాస్తవంగా చెప్పాలంటే నా లోపాల కారణంగా నాపై నేను కొంచెం సంక్లిష్టతలను పెంచుకున్నా. ప్రతీసారి మూడంకెల స్కోరు కోసమే ఆడలేం. జట్టుకు అవసరమయ్యే విధంగా 40-45 పరుగులు చేసినా నాకు సంతోషమే. కోహ్లీ 40 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుంటే అందరూ సెంచరీ గురించే ఆలోచిస్తారు. నేను సెంచరీ మాత్రమే కాదు.. అంతకంటే భారీ స్కోరు చేయగలనని కూడా నాకు తెలుసు. ఏకధాటిగా ఐదారు సెషన్ల పాటు కూడా బ్యాటింగ్‌ చేయగలను.. కానీ ప్రతీసారి సెంచరీ చేయడం ఏ బ్యాటర్‌ కూ సాధ్యం కాదు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు కోసం మంచి ప్రదర్శన చేసినపప్పుడల్లా గర్వపడతాను' అని చెప్పాడు.
రాహుల్‌ ద్రావిడ్‌ కూడా కోహ్లీ సెంచరీపై ప్రశంసలు కురిపించాడు. తాను హెడ్‌ కోచ్‌గా వచ్చాక కోహ్లీ టెస్టులలో తొలి సెంచరీ చేశాడని, అది చూడటం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని ద్రావిడ్‌ చెప్పుకొచ్చాడు.