ప్రజాశక్తి -కందుకూరు :ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈనెల 28వ తేదీన పట్టణంలో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయాలని పట్టణ తెలుగుదేశం పార్టీ ముస్లిం నేతలు పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు సమావేశం నిర్వహిం చారు. పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సలాం ఆధ్వర్యంలో నేతలు సమావేశమై జన సమీకరణ పై చర్చించారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయా ంలో దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, మైనారిటీలకు రుణాలు, విదేశీ విద్య లాంటి ఎన్నో పథకాలను అమలు చేసి ముస్లింలకు ఎంతో మేలు చేశారని అన్నారు. జగన్మో హన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పథకాలన్నీ నిలిపివేశారన్నారు. రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నియోజకవర్గ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజ్, నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి రూబీ, నియోజకవర్గ ఐటీడీపీ కోఆర్డినేటర్ షేక్ మున్నా, ఖలీల్, నజీర్, 2వ వార్డు అధ్యక్షుడు నాగూర్, నియోజకవర్గ మైనార్టీ సెల్ కార్యదర్శి షరీఫ్, షాకీర్, మాబాషా పాల్గొన్నారు.










