మాట్లాడుతున్న మాలెపాటి సుబ్బానాయుడు -
చంద్రబాబు నాయుడు సభను జయప్రదం చేయండి
ప్రజాశక్తి-కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో సోమవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ ఈనెల 29వతేదీ కావలికి విచ్చేయుచున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయ వంతం చేయాలని ప్రజలను కోరారు. అదేవిధంగా జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టే సమయం ఆసన్నమైందన్నారు. ''ఇదేమి కర్మ రాష్ట్రానికి ''అనే కార్యక్రమంతో ప్రజలతో మాట్లాడేందుకే చంద్రబాబు కావలికి వస్తున్నారని, కావలి నియోజకవర్గంలోని ప్రజలందరూ ఏకమై 29వ తేదీ సా.4.00 గంటలకు కావలి పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకొని చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి ,మాజీనెల్లూరుమున్సిపల్ చైర్మన్, తాళ్లపాక అనురాధ, రాజా నాయుడు, తిరుమల నాయుడు, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.










