మిగతా కాలాల కన్నా చలికాలంలో చర్మ సంబంధమైన సమస్యలు ఎక్కువ. ముఖ్యంగా చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సమస్యలు చికాకు కలిగిస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన చర్మం కోసం కొన్ని చిట్కాలు పాటించక తప్పదు.
ఆహారంలో తప్పకుండా తాజా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఉసిరికాయలు, బొప్పాయి, అనాస, ఖర్జూర వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
శీతాకాలంలో వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఉదయం చలి తీవ్రత తగ్గిన తర్వాత 7-8 గంటలకు నడకకు వెళ్ళటం మంచిది.
చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాలపై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్ లేదా మాస్కును ధరించాలి.
పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజింగ్ కోల్డ్ క్రీము రాసుకోవాలి.
స్నానానికి వాడే సబ్బులలో గ్లిజరిన్ ఉండేవిధంగా చూసుకోవాలి.
స్నానం మరీ చన్నీళ్లతోగానీ, మరీ వేణ్ణీళ్లతోగానీ కాకుండా గోరువెచ్చని నీటితో చేయాలి.
కూల్‌డ్రింక్స్ (శీతల పానీయాలు), ఫాస్ట్‌పుడ్స్ తీసుకోవడం తగ్గించాలి.
విటమిన్ 'సి' ఎక్కువగా ఉన్న పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని ఇతర సమస్యల నుండి కాపాడతాయి. చేపలు, అవిసెలు, సోయాబీన్స్, వాల్‌నట్స్‌లో ఇది అధికంగా లభిస్తుంది.
రెగ్యులర్ ఫేస్‌వాష్‌లు, క్లెన్సర్లు కాకుండా, సల్ఫేట్స్ లేని నాన్ ఫోమింగ్ క్లెన్సర్లు వాడాలి. వేసవి కన్నా చలికాలంలోనే సూర్య కిరణాలు తీక్షణంగా ఉంటాయి. కాబట్టి కనీసం 30 ఎస్‌పిఎఫ్, యువిఎ రక్షణ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్లను చర్మానికి రాసుకుంటే నల్లబడకుండా ఉంటుంది.