ప్రజాశక్తి - దుగ్గిరాల : మండల పరిధిలోని చిలువూరు గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు శిఖా కిరణ్ కుమార్ పది రోజుల క్రితం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో దేవాలయానికి రంగులు వేస్తూ ప్రమాదవశాత్తు పై నుంచి జారి పడటంతో ఎడమ కాలు విరిగిపోయింది. నిరుపేదలైన కిరణ్‌కుమార్ కుటుంబాన్ని ఆదుకోవడానికి భవననిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రూ.8300 విరాళాలు సేకరించారు. బుధవారం ఆ కుటుంబానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు, సిఐటియు రాష్ట్ర నాయకులు కె ఉమామహేశ్వరరావు అందజేశారు. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని దడాల సుబ్బారావు విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు పిల్లి అంకాల రావు, మక్కెన కోటేశ్వరరావు, జెట్టి బాలరాజు, వల్లభనేని సాంబశివరావు పాల్గొన్నారు.










