Dec 27,2021 11:57

తాడేపల్లి (గుంటూరు) : సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు సిఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం, తాడేపల్లి బైపాస్‌ రోడ్డు వద్ద సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు మాట్లాడుతూ... బిజెపి ప్రభుత్వం అన్ని సంస్థల్ని హిందూత్వ ఉన్మాదంతో కలుషితం చేసి ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెస్తుందన్నారు. '' ఎపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు.. విభజన హామీలు లేవు.. పోలవరం ప్రాజెక్టు కానీ, వెనుకబడ్డ రాయలసీమ, కోనసీమ ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన హామీలు కానీ అమలుకాలేదు.. పార్లమెంట్‌లో ప్రకటించిన హామీలు అమలుకు నోచుకోకుండాపోయాయి. '' అని చెప్పారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సిపిఎం ఎన్నో పోరాటాలు చేసిందని అన్నారు. బిజెపి మొత్తం ప్రభుత్వరంగాలను ప్రయివేటీకరణ చేయడమే కాకుండా రైతాంగ వ్యవసాయాన్ని కూడా రద్దు చేసేందుకు పూనుకుంటోందని విమర్శించారు. బిజెపికి వ్యతిరేక పోరాటం మన కర్తవ్యం అని పి.మధు పిలుపునిచ్చారు.