దాడులు నిర్వహించిన అధికారులు
ప్రజాశక్తి -పొదలకూరు :నెల్లూరు జిల్లా ఎస్‌ఇబి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో నెల్లూరు పోలీస్ టీమ్, ఎస్‌ఇబి ఇన్‌స్పెక్టర్ పొదలకూరు, సిబ్బందితో కలిసి బిరదవోలు అడవి ప్రాంతంలో నాటు సారాయి, తాయారు చేస్తున్నారనే సమాచారంతో బుధవారం దాడులు నిర్వహించారు. 106 లీటర్ల నాటు సారాయి, గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, రియల్ మీ టచ్ ఫోన్, 20 మీటర్ల వాటర్ పైపు స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల బెల్లపు ఊట ను ధ్వంసం చేవారు. బడుగు రమేష్‌ను అరెస్ట్ చేసి కోర్టు కు హాజరు పరిచారు. ఈ దాడుల్లో సెబ్ పోలీస్, టీమ్ ఎస్‌ఐ బాలకష్ణ, సెబ్ డిటిఎఫ్ ప్రభాకర్‌రావు, పొదలకూరు సెబ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరావు, సబ్-ఇన్స్పెక్టర్ సిహెచ్. శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు ఉన్నారు.










