ప్రజాశక్తి-కంభం రూరల్ : కంభంలోని నాయక్ వీధి ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సహెరా బేగం ఇటీవల రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును అందుకున్నారు. అందులో భాగంగా వైద్యుడు డాక్టర్ బిపి.రంగనాయకులు ఆధ్వర్యంలో సహెరా బేగాన్ని శాలువ, పూలమాలలతో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంగనాయకులు మాట్లాడుతూ వత్తి పట్ల నిబద్ధత, అంకితభావం కలిగిన వారే అవార్డులకు అర్హులని తెలిపారు. అందుకు సహెరా బేగం ఉదాహరణ అంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపాధ్యాయురాలిగా సహెరా బేగం అందించిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రహమతున్నీసా బేగం, పర్వీన్, ఎస్టియు నాయకులు సిద్ధిఖ్, విశ్రాంత ఉపాధ్యాయుడు ఇబ్రహీం పాల్గొన్నారు.