వినతి పత్రం అందజేస్తున్న సిపియం నాయకులు
ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సోమవారం సిపిఎం పట్టణ కమిటీ నాయకులు పరిశీలించారు. సుమారు 600 పేషెంట్లు వచ్చారు. ప్రతిరోజు సుమారు 400 మంది తగ్గకుండా ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. సిబ్బంది కొరతను తీర్చాలన్నారు. మురగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆహారం శుభ్రంగా ఉండేటట్లు చూడాలన్నారు. కార్మికులకు పిఎఫ్ ఈఎస్‌ఐ కార్డులు మంజూరు చేయాలని, కార్మికుల సంఖ్య పెంచాలని ఈ సమస్యలతో కూడిన అర్జీని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు అందజేశారు. బృందంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్ ఏ గౌస్ , నాయకులు ఎస్ కె మునువర్ సుల్తానా, ఎం ప్రసాద్ ,ఎం పద్మ ,అరుణ్ పాల్గొన్నారు.










