ప్రజాశక్తి-నెల్లూరు :స్థానిక 11వ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ ప్రాంతంలో అనారోగ్యంతో బాదపడుతున్న ఓ పాపను, వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు పరామర్శించి ఆర్దిక సహాయం అందజేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుజరు మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ పరిధిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము జనసేన నాయకులు వారికి అందుబాటులో ఉంటామన్నారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో కూడా తోడుగా నిలుస్తామని,ప్రభుత్వ అధికారుల దష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారం దిశగా పోరాడుతామన్నారు. 11వ డివిజన్ కమిటీ అధ్యక్షులు దాసరి వెంకటరమణ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చిన ఎంతవరకైనా పోరాడుతామన్నారు. సమస్యను నగర అధ్యక్షులు సుజాబాబు దష్టికి తీసుకొనివెళ్లగా తక్షణం స్పందించిన నగర అధ్యక్షులు వారికి కతజ్ఞతలు తెలిపారు. నగర కార్యదర్శి దాసరి మాధురి, మహిళా విభాగం సభ్యురాలు కొండ శాంతి, 11వ డివిజన్ ఉపాధ్యక్షులు రామిశెట్టి సుధాకర్, డి. సత్య, ప్రధాన కార్యదర్శి, కొండ మన బాబు, ప్రభు కుమార్, సంయుక్త కార్యదర్శి, రాంబాబు, అజరు కుమార్, సభ్యులు, పండు, నవీన్, గని పాల్గొన్నారు.










