ఆరోగ్య కేంద్రంలో తనిఖీ
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని కృష్ణాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సింగనపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్‌ను బుధవారం జిల్లా అడిషనల్ డిఎంఎల్‌హెచ్‌ఒ, జిల్లా జగనన్న ఆరోగ్య సురక్ష నోడల్ అధికారి డాక్టర్ ఎస్‌కె ఖాదర్‌వలీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం అన్నదే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇద్దరు ప్రాథమిక వైద్యాధికారులు మరో ఇద్దరు పలురకాల వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టు డాక్టర్లు పాల్గొంటారని తెలిపారు. వీరు 7 రకాల వ్యాధులకు సంబంధించి వ్యాధి నిర్థారణ పరీక్షలు, 105రకాల మందులతో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించనున్నారన్నారు. వ్యాధిగ్రస్తులకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించు తేదీ, స్థలం, సమయానికి సంబంధించిన టోకెన్‌లను సింగనపల్లి సచివాలయ పరిధిలోని బాట గ్రామస్తులకు జారిచేశామన్నారు. కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఇఒ జావీద్, సూపర్‌వైజర్లు సంషుద్ధీన్ ( సిసి), జగన్, వైద్య సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.










