Feb 15,2023 22:53

ప్రజాశక్తి-అమరావతి : ఎంఎల్‌సి ఎన్నికల ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశించింది. ఎస్‌టియుఎపి, ఎపియుటిఎఫ్‌ల తరపున చలసాని అజయ్ కుమార్‌, చలసాని వెంకట్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ మన్వేందర్‌నాథ్‌ రాయ్ బుధవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా కడప-కరూులు, అనంతపూర్‌, ప్రకాశం-ఒంగోలు, నెల్లూరు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న పలు అవకతవకలను పిటిషనర్ల తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. డిఇఒ సంతకం కూడా లేకుండా కొనిు విద్యాసంస్థలు సర్వీసు సర్టిఫికేట్లు జారీ చేశాయని, వాటి ఆధారంగా ఓటుహక్కు ఇచ్చారని న్యాయవాదులు చెప్పారు. దీనికి సంబంధించిన పలు ఆధారాలను సమర్పించారు. దీంతో తీవ్రంగా స్పందించిన ధర్మాసనం ప్రతి సర్వీసు సర్టిఫికేట్‌ను క్షుణంగా పరిశీలించి, డిఇఒ సంతకాలు లేని వాటిని గుర్తించాలని పేర్కొంది. అలా గుర్తించిన వాటినిఓటర్ల జాబితా నుండి తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత రూపొందించిన జాబాతాను కోర్టులో సమర్పించాలని పేర్కొంది. ఎంఎల్‌సి ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు మొదటి నుండి ఆరోపిస్తును సంగతి తెలిసిందే. ఈ మేరకుఎనిుకల సంఘానికి ఫిర్యాదు చేయడంతో కొనిు ఓట్లను తొలగించారు. అయినా, పెద్ద సంఖ్యలో అక్రమ ఓట్లు కొనసాగుతుండటం, కనీస విద్యార్హతలు లేనివారు కూడా ఉపాధ్యాయుల ఓటర్ల జాబితాలో స్థానం పొందడంతో ఆ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.