ప్రజాశక్తి - జక్కావెంకయ్య, టి.నరసింహయ్య, సున్నం రాజయ్యనగర్ (తాడేపల్లి) : గత మహాసభ నుండి ప్రస్తుత మహాసభకు మధ్యకాలంలో అమరులైన కమ్యూనిస్ట్, వామపక్ష, ఉద్యమ నాయకులకు, కార్యకర్తలకు ప్రగతిశీల వాదులకు మహాసభ నివాళులర్పించింది. సంతాప తీర్మానాన్ని మహాసభల స్టీరింగ్ కమిటీ సభ్యులు వై.వెంకటేశ్వరరావు ప్రవేశపెట్టారు. మహాసభకు హాజరైన ప్రతినిధులు ఒక నిమిషంపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత జక్కా వెంకయ్య, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు సున్నం రాజయ్య, కర్నూలు జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత తెలకపల్లి నరసింహయ్య ఈ కాలంలో మరణించారని వారికి సంతాపం ప్రకటించారు. వారి పేరునే మహాసభల ప్రాంగణానికి పెట్టినట్లు తెలిపారు. అలాగే కర్నూలు జిల్లా మాజీ కార్యదర్శి టి.షడ్రక్, పార్వతీపురం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి పేరుతో ప్రాంగణం ఏర్పాటు చేశామని, వారికీ జోహార్లర్పించింది. వీరితోపాటు అంతర్జాతీయంగా వియత్నాం కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి లేకా పియూ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత మాజీ ప్రధాని లీపెంగ్, లాటిన్ అమెరికా మార్క్సిస్టు మేధావి మార్తా హంగేకర్‌కు విప్లవ జోహార్లర్పించింది. పార్టీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యులు, రైతు ఉద్యమ నాయకులు కె.వరదరాజన్, కేంద్ర కమిటీ సభ్యులు గౌతమ్ దాస్, బిజన్‌ధర్, బజుబన్ రియాన్ (త్రిపుర), నిరుపమసేన్, శ్యామల్ చక్రబర్తి (పశ్చిమబెంగాల్), మహేంద్ర సింగ్ (మహారాష్ట్ర), గణేష్ శంకర్ విద్యార్థి (బీహార్), మోహర్ సింగ్ (హిమాచల్‌ప్రదేశ్) లకు మహాసభ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా పనిచేసిన రాజేంద్రసింగ్ ముండా (జార్ఘండ్), యెస్.రవికుమార్ (చత్తీస్‌ఘడ్) డి.లక్ష్మణన్ (తమిళనాడు), బి.మాధవ (కర్ణాటక) మహాసభ సంతాపం ప్రకటించింది. వీరితోపాటు ఎంసిపిఐ(యూ) ఆలిండియా కార్యదర్శి ఎండి గౌస్, ఏ.ఐ.టి.యు.సి జాతీయ పూర్వ కార్యదర్శి గురుదాస్ గుప్తా, ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శి క్షితి గోస్వామిలకు నివాళులర్పించింది. మహిళా ఉద్యమ జాతీయ నేతలు ప్రమీలా పాంథే, మైథిలీ శివరామన్, రంజనా నిరులా, గౌరియమ్మ (కేరళ), మంగళేశ్వరి (త్రిపుర) సంతాపం ప్రకటించారు. ఆల్ ఇండియా సైన్స్ ఫోరమ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్‌సేన్ గుప్తా, పోస్టల్ యూనియన్ జాతీయ మాజీ అద్యక్షులు రావి శివన్నారాయణకు నివాళులు తెలిపింది. పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులుగా పనిచేసిన భద్రాచలం మాజీ శాసనసభ్యులు కుంజా బుజ్జి, నన్మరాన్, కె.తంగవెలు(తమిళనాడు), శ్యామ్ ప్రసాద్ కేసర్ (జమ్ము కాశ్మీర్), అవిక్‌దత్తా, మ్రగాంకా భట్టాచార్య (పశ్చిమ బెంగాల్), బబుల్ భధ్ర, సుభోధ్ దాస్, మదన్ దాస్ (త్రిపుర)లకు మహాసభ సంతాపాన్ని ప్రకటించింది. ప్రకాశం జిల్లా మాజీ కార్యదర్శి కామ్రేడ్ పమిడి కోటయ్య, అనంతపురం మాజీ జిల్లా కార్యదర్శి జి.జె.రావులకు మహాసభ సంతాపం తెలిపింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులుగా పనిచేసిన శేషగిరిరావు (విజయనగరం), మనోజ, చేబోలు సత్యనారాయణ, మారుబోయిన సావిత్రమ్మ, (పశ్చిమగోదావరి (డెల్టా), చేబ్రోలు భాస్కరరావు కృష్ణా(తూర్పు), టి.సుబ్బారెడ్డి కృష్ణా(పశ్చిమ), జి.విజయలక్ష్మి (పశ్చిమగోదావరి అప్‌ల్యాండ్), మద్దయ్య (నంద్యాల), ఏటుకూరి గంగాధరరావు గుంటూరు (తూర్పు), జెడ్.మస్తానయ్య( నెల్లూరు) యూనివర్సిటీ ఉద్యమ నాయకులు హరిబాబు (గుంటూరు)కు సంతాపం ప్రకటించారు. మహిళా ఉద్యమ నేతలు అన్నే అనసూయమ్మ (పశ్చిమ గోదావరి), డి.బిక్షావతి, నాగళ్ల రాజేశ్వరమ్మ (కృష్ణా), దిగుమర్తి కమలమ్మ (శ్రీకాకుళం), టి.లక్ష్మమ్మ (కర్నూలు), నాగభూషణమ్మ (తిరుపతి), సత్యవతి (కందుకూరు)లకు మహాసభ సంతాపం తెలిపింది. శాసన మండలి మాజీ సభ్యులు జార్జి విక్టర్, ఉపాద్యాయ ఉద్యమ నాయకులు కె.కేశవరెడ్డి, నాగమల్లేశ్వరరావు, స్వాతంత్ర సమరయోధులు సిపిఎం సీనియర్ నాయకులు పెంటకోట జగన్నాధం (విశాఖ), చింతపల్లి లక్ష్మారాయుడు (తూర్పు కృష్ణా), పరుచూరి నారయ్య (నెల్లూరు), పలవలి రామకృష్ణారెడ్డి (చిత్తూరు)లకు మహాసభ సంతాపం ప్రకటించింది. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట యోధులు కొత్తపల్లి లక్ష్మీనారాయణ, గట్టికొప్పుల రాంరెడ్డిలకు మహాసభ సంతాపం ప్రకటించింది. ప్రముఖ నాటక రచయిత గిరీష్ కర్నాడ్, ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు, అబ్బూరి ఛాయాదేవి, పౌరహక్కుల ఉద్యమనేత, దళితనాయకులు ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ జస్టీస్ పున్నయ్య, ప్రధానమంత్రి మాజీ కార్యదర్శి నాదెళ్ల యుగంధర్, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి పి.ఎస్.కష్ణన్, స్వామి అగ్నివేష్ మృతికి మహాసభ సంతాపం తెలిపింది. ఇటీవల కాలంలో మరణించిన ప్రముఖ పాత్రికేయులు రాఘవాచారి (విశాలాంధ్ర), పొత్తూరి వెంకటేశ్వర రావు, తుర్లపాటి కుటుంబరావు, సింగమనేని నారాయణ, ముత్యాలప్రసాద్(విశాలాంధ్ర మాజీఎడిటర్), అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పిపిసి జోషిలకు మహాసభ సంతాపం ప్రకటించింది. సాహిత్య, సంగీత, క్రీడా, కళారంగాలకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, హాస్యనటులు జయప్రకాష్ రెడ్డి, ప్రముఖ కవి దేవిప్రియ, ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు, దాదాఫాల్కే అవార్డు గ్రహీత సినీదర్శకులు మృణాల్‌సేన్, ప్రముఖ బెంగానీ నటులు కవి సౌమిత్ర చటర్జీ, ఫుట్‌బాల్ దిగ్గజం, వామపక్ష వాది డిగో మారడోనా, ప్రొఫెసర్ డి.ఎన్.ఝా, కాట్రగడ్డ నరసయ్య, ప్రజాకళాకారుడు నిసార్, అరుణోదయ రామారావు, నాస్తిక కేంద్రం సంచాలకులు గోపరాజు విజయం, మాంటిసోరి విద్యాసంస్థల కోటేశ్వరమ్మ, మానవహక్కుల కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ బి.శుభాషణ్ రెడ్డికి మహాసభ సంతాపం ప్రటించింది. ప్రజా వైద్యులు డాక్టర్ కె.భాస్కరరావు, పాపులర్ షూమార్ట్ అధినేత చుక్కపల్లి అమర్, వామపక్ష ఉద్యమనేతలు ఎ.పి.విఠల్, కొల్లి నాగేశ్వరరావు, షేక్ నాసర్‌వలి, కాకర్లపూడి. సుబ్బరాజు, చల్లపల్లి శ్రీనివాసరావుకు మహాసభ సంతాపం ప్రటిస్తున్నది. అలాగే ఎల్‌బిజి సతీమణి సరోజిని, కుమారుడు ప్రేమ్ సాగర్, హరికిషన్ సింగ్ సూర్జిత్ సతీమణి ప్రీతమ్‌కౌర్, సీతారాం ఏచూరి తల్లి కల్పకం, కుమారుడు ఆశిష్ ఏచూరికి మహాసభ సంతాపం ప్రకటించింది. ఈ కాలంలో కరోనాతో మరణించిన వారికి, సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అమరులైన 750 మంది రైతులకు, యు.పి లఖింపూర్ ఖేరి ఘటనలో చనిపోయిన నలుగురు రైతులు, జర్నలిస్ట్‌కి, ఎన్‌ఆర్‌సి, సిఎఎను నిరసిస్తూ జరిగిన ప్రదర్శన సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన 17 మందికి, హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన వైమానిక దళ అధికారులకు, మహాసభ సంతాపాన్ని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ గూండాల దాడిలో, కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ గూండాల దాడిలో మరణించిన వామపక్ష కార్యకర్తలకు మహాసభ జోహార్లర్పించింది. ఉగ్రవాద దాడులు, ప్రకృతివైపరీత్యాలు, ప్రమాదాలు, రైలు, రోడ్డు ప్రమాదాలు, కార్పొరేట్ కళాశాల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులు, ఆత్మహత్యలు చేసుకున్న రైతు, చేనేత కార్మికులకు మహాసభ ప్రగాడ సంతాపాన్ని తెలిపింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పార్టీ, ప్రజాతంత్ర ఉద్యమాభివృద్ధికి కృషి చేసిన వందలాది మంది పార్టీ సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఈ కాలంలో అనారోగ్యంతో, వయోభారంతో మరణించిన వారందరికీ పేరుపేరున ఈ మహాసభ నివాళులర్పించింది.
ఈ కాలంలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో రాజకీయ, సాంస్కృతిక, సాహితీ, కళారంగాలలో మరణించిన ప్రముఖులు, మేధావులు సామ్రాజ్యవాద శక్తులు, అభివృద్ధి నిరోధక శక్తులు పొట్టన పెట్టుకున్న ప్రజలకు మహాసభ సంతాపం ప్రకటించింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.










