ప్రజాశక్తి-నెల్లూరు : నగరంలోని డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి స్వగృహంలో పెన్నా రచయితుల సంఘం ఆధ్వర్యంలో జమున స్మారక జాతీయ స్థాయి నానీల పురస్కారం, డాక్టర్ జయప్రద నవాల పురస్కార సభలో నానీల కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 30 మంది కవులు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెళ్ళకూరు జయప్రద స్వామి రెడ్డి రచించిన వైద్య పరిజ్ఞానం ఇంట్లో ఆరోగ్యం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మెట్టు రామచంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా, కాళిదాసు పురుషోత్తం పుస్తకావిష్కరణ చేశారు. ప్రముఖ కవి మోపూరు పెంచల నరసింహ మొదటి ప్రతిని స్వీకరించారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతతోపాటు సమన్వయకర్త అధ్యక్షులు అవ్వారు శ్రీధర్ బాబు వ్యవహరించారు. నవలా పురస్కారం గ్రహీత ప్రభాకర్ జానీ అమ్మ నానీల రచయిత పుచ్చకాయల పుచ్చకాయల బ్రహ్మాజీరావు సత్కరించారు. హీరోనవలను శిరం శెట్టి కాంతారావు ,అమ్మ నానీలను కొండ్రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి సమీక్ష చేశారు. గోవిందరాజు సుబద్రా దేవి , కోసూరు రత్నం , పెరుగు రామకష్ణ , చిన్ని నారాయణ రావు, ఈతకోట సుబ్బారావు , పాతూరి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.










