Jul 07,2021 22:03

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పాఠశాలలు ఆగస్టు 15 తర్వాత ప్రారంభం కానున్నాయి. ఈ లోగానే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విద్యాశాఖపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు ఆన్‌లైన్‌లో వర్క్‌బుక్‌ ద్వారా పిల్లలకు బోధన జరపాలని ఆదేశించారు. విద్య, బోధన, మౌలిక సదుపాయాలు కల్పన నాణ్యంగా ఉండాలనే లక్ష్యంగా నూతన విద్యావిధానం అమలు చేస్తున్నామన్నారు.

ఇంటర్‌ మార్కుల విధానం ఖరారు
ఇంటర్మీడియేట్‌ రెండో సంవత్సరం మార్కుల అసెస్‌మెంట్‌ను సమావేశంలో ఖరారు చేశారు. పదోతరగతిలో టాప్‌ా3 సబ్జెక్టులకు 30శాతం మార్కులు, ఇంటర్‌ మొదటి సంవత్సరం సబ్జెక్టు వైజ్‌ మార్కులకు 70శాతంగా మార్కులు ఆధారంగా ఇవ్వనున్నారు.ప్రాక్టికల్‌ పరీక్షల ఫలితాలు ఆధారంగా మార్కులు ఇవ్వనున్నారు.