Sep 20,2023 21:33

ఫొటో : మాట్లాడుతున్న ఎపిఒ శ్రీనివాసరావు

ఆడిట్‌కు రికార్డులు సిద్ధం చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉపాధి హామీ పథకంలో భాగంగా జరనున్న సోషల్‌ ఆడిట్‌కు సంబంధించిన రికార్డులను సిద్ధం చేయాలని ఎపిఒ శ్రీనివాసరావు సిబ్బందికి ఆదేశించారు. బుధవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో మండలంలోని 17 పంచాయతీలకు సంబంధించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా డ్వామా అధికారుల ఆదేశాల మేరకు పనులు జరిగిన ప్రదేశం, కూలీలకు ఇచ్చిన నగదు, మస్టర్లు, జాబ్‌ కార్డులు, బ్యాంక్‌ అకౌంట్‌ అన్ని వివరాలతో రికార్డులు సర్వం సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
25న లేక ఒకటో తేదీ నుండి ఆడిట్‌ సిబ్బంది వస్తున్నారని తెలిపారు. సోషల్‌ ఆడిట్‌ సిబ్బందికి టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు సహకరించాలని పొరపాటులకు తావు లేకుండా అన్ని రికార్డులు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఎఫ్‌ఎలు, కంప్యూటర్‌ ఆపరేటర్‌లు పాల్గొన్నారు.