ప్రజాశక్తి-తుగ్గలి (కర్నూలు) : ఎమ్మిగనూరులో 12 వ సీఐటీయు మహాసభలకు ఆదివారం సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు, విఆర్‌ఏ ల సంఘము జిల్లా అధ్యక్షులు మారెళ్ల అంజి, సీఐటీయు మండల కమిటీ అధ్యక్షులు రంగస్వామి, కార్యదర్శి ప్రతాప్, మీటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజు, రైతు సంఘము నాయకులు కొండారెడ్డి, డివైఎఫ్‌ఐ అధ్యక్షులు ఎల్లప్ప ఆధ్వర్యంలో మండలంలో నుండి అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, హమిలి యూనియన్, పారిశుధ్య కార్మికులు, తదితరులు ఆటోలలో, ట్రక్ లలో మహాసభ కు బయలుదేరారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తరిమి కొట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు చట్టాలను అమలు చేయడం లేదన్నారు. పై సమస్యలపై మహాసభ లో చర్చించామన్నారు. ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాలకు చెందిన కార్మిక నాయకులు పాల్గొన్నారు.










