- నేడు చెన్నైతో లక్నో ఢీ
- రాత్రి 7 గం నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆరో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2023లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. అంతకుముందు, చెన్నై సూపర్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది. మరోవైపు కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్ మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను భారీ తేడాతో ఓడించిన ఉత్సాహంతో చెన్నైపై విజయం సాధించాలని బరిలోకి దిగనుంది.
జట్లు (అంచనా) :
చెన్నై: డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్థన్ హంగార్గేకర్, తుషార్ దేశ్ పాండే
లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్నస్ స్టొయినిస్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కనాల్ పాండ్య, ఆయుష్ ఆదోని, నికోలస్ పూరన్, అవేశ్ ఖాన్, మార్క్‌వుడ్, రవి బిష్ణోరు, కృష్ణప్ప గౌతమ్










