Sep 30,2023 11:04

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కమ్యూనిస్టులపై వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. స్కిల్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి రోజువారీ తరహాలోనే శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుని వైసిపి కక్షపూరితంగా అరెస్ట్‌ చేయించిందని కమ్యూనిస్టులు కూడా అంటున్నారని ఆయన చెప్పారు,. 'వాళ్ల సిద్దాంతాలేమైనాయో అర్ధం కావడంలేదు.' అని అన్నారు. కక్ష పూరితంగానో, ఇంకో రకంగానో జరిగిందేమిటో కూడా చూడటం లేదు' అని చెప్పారు. 'వాళ్లెంతకు అమ్ముడుపోయారో.. ఏం చేస్తున్నారో... ఎందుకు తాబేదార్ల మాదిరి చంద్రబాబునాయుడి అడుగులకు ఎందుకు మడుగులొత్తుతున్నారో, ఆయన ఆలోచనలన్నింటిని వీరి నోళ్ల ద్వారా ఎందుకు చిలకపలుకులు పలుకుతున్నారో.. వారే ఆలోచించుకోవాలి' అని సజ్జల నోరుపారేసుకున్నారు.