- మెరిసిన దీప్తి, పూజ
- ట్రయాంగులర్ సిరీస్
ఈస్ట్ లండన్: మహిళల ట్రయాంగులర్ టి20 సిరీస్ ఫైనల్లోకి భారత మహిళలజట్టు ప్రవేశించింది. సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారతజట్టు 8వికెట్ల తేడాతో వెస్టిండీస్ అమ్మాయిలపై గెలుపొందింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 94పరుగులే చేసింది. ఓపెనర్, కెప్టెన్ హీలీ మాథ్యూస్(34), జేమస్స్(21) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. దీప్తి శర్మ(3/11), పూజ(2/19) బౌలింగ్‌లో మెరిసారు. ఛేదనలో భారత మహిళల జట్టు ... ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన(5) నిరావపరిచినా.. మరో ఓపెనర్ జెమిమా రోడ్రిగ్స్(...) బ్యాటింగ్‌లో రాణించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్(...) కూడా రాణించడంతో భారతజట్టు ... ఓవర్లలో .. వికెట్ల నష్టపోయి ... పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో భారతజట్టు 13పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగే ఫైనల్లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.

స్కోర్‌బోర్డు..
వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్: మాథ్యూస్ (సి)యస్టికా భాటియా(బి)పూజ 34, విలియమ్స్ (బి)దీప్తిశర్మ 8, క్యాంప్‌బెల్ (బి)దీప్తి 0, జోసెఫ్ (ఎల్బి)గైక్వాడ్ 3, షాబికా (స్టంప్)యస్టికా భాటియా (బి)దీప్తి 12, జేమ్స్ (నాటౌట్) 21, ఆలియా (సి)దీప్తి (బి)పూజ 9, అదనం 7. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 94పరుగులు.
వికెట్ల పతనం: 1/18, 2/18, 3//39, 4/53, 5/73, 6/94
బౌలింగ్: రేణుకా సింగ్ 4-0-22-0, శిఖా పాండే 3-0-29-0, దీప్తి శర్మ 4-2-11-3, గైక్వాడ్ 4-1-9-1, దేవిక వైద్య 1-0-4-0, పూజ 4-1-19-2.
ఇండియా మహిళల ఇన్నింగ్స్: స్మృతి మంధాన (బి)కానెల్ 5, జెమిమా రోడ్రిగ్స్ (నాటౌట్) 42, హర్లిన్ డియోల్ (సి)గజ్నాబీ (బి)మాథ్యూస్ 13, కౌర్ (నాటౌట్) 32, అదనం 3. (13.5ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 95పరుగులు.
వికెట్ల పతనం: 1/8, 2/41
బౌలింగ్: గ్లాస్గో 2-0-17-0, కాన్నెల్ 3-0-17-1, ఆలియా 2-0-14-0, మాథ్యూస్ 2-0-7-1, ఫ్లెఛర్ 2-0-12-0 జేమ్స్ 2-0-22-0, గజ్నబీ 0.5-0-5-0










