Oct 20,2022 21:11

ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యుబిఐ) 21.07 శాతం వృద్థితో రూ.1,848 కోట్ల నికర లాభాలు సాధించింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,526 కోట్ల లాభాలు ప్రకటించింది. క్రితం క్యూ2లో యుబిఐ నికర వడ్దీ ఆదాయం 21.61 శాతం పెరిగి రూ.8,305 కోట్లుగా నమోదయ్యింది. వడ్డీయేతర ఆదాయం 17.65 శాతం తగ్గి రూ.3,276 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే కాలానికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 12.64 శాతంగా ఉండగా.. క్రితం సెప్టెంబర్‌ ముగింపు నాటికి 8.45 శాతానికి తగ్గాయి.