Mar 16,2023 22:12

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
లండన్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లో త్రీషా జోలీాగాయత్రీ గోపీచంద్‌ జోడీ హవా కొనసాగుతోంది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్‌ పోటీలో త్రీషాాగాయత్రి జోడీ 21-14, 24-22తో జపాన్‌కు చెందిన హిరోటాాఫుకుషిమాపై విజయం సాధించారు. క్వార్టర్‌ఫైనల్లో భారత మహిళల జోడీ చైనా టాప్‌సీడ్‌ జోడీతో తలపడనుంది. ఇక పురుషుల డబుల్స్‌లో భారత స్టార్‌ షట్లర్లు చిరాగ్‌శెట్టిాసాత్త్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి జోడీ పోరాటం ప్రి క్వార్టర్స్‌కు ముగిసింది. చిరాగ్‌ాసాత్త్విక్‌ జోడీ 21-19, 17-21, 19-21తో చైనాకు చెందిన లియాంగ్‌-వాంగ్‌ చేతిలో పోరాడి ఓడారు. మరో డబుల్స్‌ జోడీ అర్జున్‌ాధృవ్‌ కపిల 16-21, 15-21తో చైనా జంట చేతిలోనే పరాజయాన్ని చవిచూశారు.