Jun 15,2023 11:20

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : మహాకవి శ్రీశ్రీ 40వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం , ప్రజానాట్యమండలి విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ఉన్నటువంటి శ్రీ శ్రీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. శ్రీశ్రీ అందించినటువంటి అభ్యుదయ విప్లవకర సాహిత్యాన్ని ప్రజానాట్యమండలి నిరంతరం కళారూపాలు సృష్టించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందన్నారు. నేటి పరిస్థితుల్లో కార్మిక హక్కుల పరిరక్షణ ప్రభుత్వ రంగం సంస్థల పరిరక్షణ వంటి కర్తవ్యాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ప్రజలకు తెలియజేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి సీనియర్‌ నాయకులు చలపతి, ప్రజానాట్యమండలి కార్యదర్శి ఎం చంటి, జిల్లా అధ్యక్షులు జి రమణ, జిల్లా గౌరవ అధ్యక్షుడు దండు నాగేశ్వరరావు, బాదంగిరి సాయి, సాహితీ స్రవంతి నాయకులు ఏ వి ఆర్‌ కె మూర్తి, వై అప్పారావు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సంతోష్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు అజరు, చింటూ, సిఐటియు ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు సీతారత్నం తదితరులు పాల్గొని నివాళులర్పించారు.