మంగళగిరి రూరల్ (గుంటూరు) : ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ... ఎంసెట్ తృతీయ కౌన్సిలింగ్లో ఎంసెట్ విద్యార్థులందరికీ అవకాశం కల్పించాలని ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఎపి హైయర్ ఎడ్యుకేషన్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మూడో విడత కౌన్సిలింగ్ను అందరికీ నిర్వహించాలని నినాదాలు చేస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి బయటికి రావాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి మందగల సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.